అడవిలో ప్రమాదాలకు అదే కారణం.. నర్సాపూర్‌లో క్లీన్‌ డ్రైవ్‌ | Officials cleaning drive in Narsapur forest | Sakshi
Sakshi News home page

అడవిలో ప్రమాదాలకు అదే కారణం.. నర్సాపూర్‌లో క్లీన్‌ డ్రైవ్‌

May 16 2026 3:53 PM | Updated on May 16 2026 4:01 PM

Officials cleaning drive in Narsapur forest

సాక్షి, నర్సాపూర్‌: అడవి ప్రాంతాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయడం వల్ల కలిగే నష్టాలపై నర్సాపూర్‌ అడవీ ప్రాంతంలో క్లీనప్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవ్ వాటర్ అండ్ నేచర్, యూత్ ఫర్ సేవ ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ సూల్ ,మెదక్ జిల్లా అడవీ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇటీవల కాలంలో అడవి ప్రాంతానికి వచ్చే సందర్శకులు  కోతులకు ఆహారం వేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు వంటి పర్యావరణ హానికర వ్యర్థాలు అధికంగా పేరుకపోతున్నాయి. ఇవి పర్యావరణాన్ని  కలుషితం చేయడమే కాకుండా, రోడుపై ప్రయాణించే వాహనాలపై ఎగిరిపడడంతో  ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు వాలంటీర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నర్సాపూర్ అడవీ ప్రాంతంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహాకులు మాట్లాడుతూ అడవి జంతువులకు బాధ్యతారహితంగా ఆహారం వేయడం ప్రకృతికి హానికరం. అడవిని పరిశుభ్రంగా ఉంచడం  జంతువులను, మనుషులను  రక్షించవచ్చు. నర్సాపూర్ అడవీ సౌందర్యాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని కోతులకు ప్లాస్టిక్‌ కవర్లలో ఆహారం ఇవ్వకూడదని  ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సేవ్ వాటర్ అండ్ నేచర్, వ్యవస్థాపకురాలు  మేఘనా ముసునూరి, యూత్ ఫర్ సేవ హెదరాబాద్ VM గౌతమ్ చెరిపల్లి, జిల్లా అడవీ అధికారి శ్రీఎం. జోజి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement