హైదరాబాద్: రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్‌ను రప్పించి డ్రైవర్‌ను బలవంతంగా దింపి అంబులెన్సుతో పరారయ్యారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్ (32) చెంగిచెర్లలోని శ్రీఎస్‌విఎస్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న అసుపత్రి సిబ్బందికి ఫోన్ రావడంతో అంబులెన్స్‌తో లొకేషన్‌కు వెళ్లాడు.
అక్కడ ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో ఎక్కి మహిళకు కడుపునొప్పి ఉంది.. కామినేని అసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. సోదరుడు వస్తాడని చెప్పి సీపీఆర్‌ఐ రోడ్డులోని నిర్మానుష్య ప్రాతంతో అంబులెన్స్‌ను ఆపారు. మరో ఆద్దరు వ్యక్తులు వచ్చి డ్రైవర్‌ను బలవంతంగా కిందకు దింపి ఐదుగురూ కలిసి అంబులెన్సుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంన్నారు.


