మొయినాబాద్‌ జంట హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Moinabad Double Murder Case Takes Shocking Turn, Couple Allegedly Planned To Kill Eight Lenders, More Details Inside | Sakshi
Sakshi News home page

మొయినాబాద్‌ జంట హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

May 18 2026 4:02 PM | Updated on May 18 2026 5:13 PM

Big twist on moinabad karima begum case

సాక్షి,హైదరాబాద్‌: మొయినాబాద్‌ జంట హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్‌ ప్లాన్‌ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్‌ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. 

దీంతో వారిని  చంపేయాలని కరీమాబేగం, రెహమాన్‌ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్‌ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్‌ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.

మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్‌ హౌస్‌కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement