సిట్‌కు బండి భగీరథ్‌ లేఖ | Bandi Sanjay Son Bhageerath Letter To Sit | Sakshi
Sakshi News home page

సిట్‌కు బండి భగీరథ్‌ లేఖ

May 13 2026 5:50 PM | Updated on May 13 2026 6:10 PM

Bandi Sanjay Son Bhageerath Letter To Sit

సాక్షి, హైదరాబాద్‌: సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ రాశారు. ఎల్లుండి(శుక్రవారం) విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్‌.. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇవాళ(మే 13) హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు.

..వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదన్న భగీరథ్‌.. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడు‌వంటూ లేఖలో భగీరథ్‌ ప్రస్తావించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్‌కు విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు విచారణకు ఇవాళ బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడైన బండి భగీరథ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి హాజరవుతానంటూ సిట్‌కు భగీరథ్‌ లేఖ రాశారు

కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు  తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.

బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement