అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు,
విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్‌ఎస్‌పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్‌కు చెందిన డా. శివరంజని ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్‌కు కౌంటర్‌గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
నెటిజనుల స్పందన
వావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.
చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.
ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.
ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు.
ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?


