మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్‌ | TPCC Mahesh Goud Political Counter To PM Modi | Sakshi
Sakshi News home page

మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్‌

May 11 2026 11:10 AM | Updated on May 11 2026 12:19 PM

TPCC Mahesh Goud Political Counter To PM Modi

సాక్షి, నిజామాబాద్: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటిరిచ్చారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు.. కేవలం బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చిన బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి బహుషా తెలంగాణ పరిస్థితులు తెలియకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం ప్రజలకు రుచించదు. తెలంగాణ కాంగ్రెస్‌కు అనుకూలం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో సెక్యులార్ల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్.. వారితో మాకు కలయిక ఉండదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటాయి’ అని క్లారిటీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement