సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్‌స్థాయి అధికారుల్ని నియమించింది.
ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది.
ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్
46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం
68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్
మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లు
జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలు
జూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్
జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణ
జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారం
సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా విడుదల
తెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్
35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం
25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్
మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు
జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలు
జూన్ 24 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్
జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణ
జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారం
అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదల
ఈసీ అధికారిని కలవనున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు.


