పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్‌ | Bandi Bhagirath Surrenders to Police | Sakshi
Sakshi News home page

పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్‌

May 16 2026 8:33 PM | Updated on May 17 2026 9:45 AM

Bandi Bhagirath Surrenders to Police

హైదరాబాద్‌: పేట్‌బషీరాబాద్‌లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్‌.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్‌ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో  బండి భగీరథ్‌ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. 

పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‌
‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా.  ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్‌.

తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత  ఏ  తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్‌. చట్టం ముందు అంతా సమానమేనని,   ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేశాం: సీపీ
బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేశామని  సైబరాబాద్‌ సీపీ రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్‌ను గాలించే క్రమంలో అరెస్ట్‌ చేశామన్నారు. నార్సింగ్‌లోని పోలీస్‌ అకాడమీ వద్ద భగీరథ్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. అటు తర్వాత పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నామన్నారు సీపీ

ఇదిలా ఉంచితే, బండి భగీరథ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్‌ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ కూడా కోర్టు రికార్డ్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు.

​కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ​బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్‌మెంట్ ప్రక్రియ.. ​కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement