కేబీఆర్‌ పార్క్‌ వ్యవహారం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు | Hyderabad KBR Park Row, Supreme Court Halts Tree Felling Near KBR Park And Issues Stay On Flyover Linked Works | Sakshi
Sakshi News home page

కేబీఆర్‌ పార్క్‌ వ్యవహారం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

May 18 2026 1:02 PM | Updated on May 18 2026 1:27 PM

Hyderabad KBR Park Supreme Court Stay Orders News

సాక్షి, హైదరాబాద్‌: కాసు బ్రహ్మనందరెడ్డి పార్క్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఉద్యానవనం ఆవరణలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్టే ఆర్డర్స్‌ జారీ చేసింది. తదుపరి విచారణ చేపట్టేంతదాకా పార్క్‌కు 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి కోర్టు స్పష్టం చేసింది. 

వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న కేబీఆర్‌ నేషనల్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అండర్‌పాస్‌ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ డైవర్షన్లూ విధించారు. అయితే చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. 

ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్టే ఆర్డర్‌ ఇచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ..  తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.  

ఎస్‌ఆర్‌డీపీ (SRDP - Strategic Road Development Plan) పేరిట.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేబీఆర్‌ పార్క్‌ వద్ద నిర్మాణలకు దిగింది. అయితే.. సుప్రీం కోర్టు స్టేతో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఆ పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement