మమత ఎక్కడ..? ఇద్దరు పిల్లలతో అదృశ్యం | Mother and Two Children Go Missing in Patancheru | Sakshi
Sakshi News home page

మమత ఎక్కడ..? ఇద్దరు పిల్లలతో అదృశ్యం

May 13 2026 11:15 AM | Updated on May 14 2026 1:52 PM

Mother and Two Children Go Missing in Patancheru

పటాన్‌చెరు టౌన్‌: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌ చెరు డివిజన్‌ పరిధిలోని మల్లన్న దేవస్థానం సమీపంలోని ఎండీఆర్‌ హోమ్స్‌లో నివాసం ఉండే నాగిరెడ్డి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి భార్య మమత (28), కుమారుడు శివరాం రెడ్డి, కూతురు బృందన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా వారి కోసం తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.  

మరో ఘ‌ట‌న‌లో..
శివ్వంపేట(నర్సాపూర్‌): తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోమారం గ్రామానికి చెందిన ఎరుకలి మమత, పెంటయ్య దంపతులకు సంసార విషయంలో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. 

సోమవారం పెంటయ్య ధాన్యం బస్తాలు తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగా, భార్య మమత, కూతురు అఖిల కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన పెంటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement