రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్‌ ఫిల్మ్‌ యాక్టర్ల మృతి | Road Accident in Hyderabad Outer Ring Road | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్‌ ఫిల్మ్‌ యాక్టర్ల మృతి

May 11 2026 5:49 AM | Updated on May 11 2026 7:11 AM

Road Accident in Hyderabad Outer Ring Road

భరత్‌ కాంత్‌ (ఫైల్‌), సాయి త్రిలోక్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై దుర్ఘటన 

ఇబ్రహీంపట్నం రూరల్‌: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ట్‌ ఫిల్మ్‌ యాక్టర్లు మృతిచెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్‌కాంత్‌(31), గూడ సాయి త్రిలోక్‌(31) అనే ఇద్దరు షార్ట్‌ ఫిల్మ్‌ యాక్టర్లు శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. 

ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ వైపు వస్తుండగా బొంగ్లూర్‌ ఎగ్జిట్‌–12 సమీపంలో కారు డ్రైవర్‌ అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురెదురుగా వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్‌కాంత్, గూడ సాయి త్రిలోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున 3.20గంటల సమయంలో ఓఆర్‌ఆర్‌ పెట్రోలింగ్‌ అధికారి శ్రీకాంత్‌ ఇచి్చన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement