భార్యపై అనుమానం.. గొడ్డలితో కాలు నరికిన భర్త | Sangareddy Man Arrested For Brutally Attacking Wife Over Suspicion Of Infidelity, More Details Inside | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానం.. గొడ్డలితో కాలు నరికిన భర్త

May 14 2026 12:20 PM | Updated on May 14 2026 1:23 PM

Husband Cuts Off Wife Leg in Suspicion

సంగారెడ్డి: భార్య కాలును నరికిన భర్తను పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలు పుల్కల్‌ ఎస్‌ఐ విశ్వజన్‌ వెల్లడించారు. చౌటకూర్‌ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి వీరమణి, దుర్గయ్య భార్యాభర్తలు. వీరిద్దరూ బతుకు దెరువు కోసం సంగారెడ్డిలోని కొత్ల చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో తరచూ దుర్గయ్య గొడవపడేవాడు. 

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో దుర్గయ్య ఇంట్లో ఉన్న భార్య కుడికాలును గొడ్డలితో నరికాడు. అలాగే కుడి చేతిపై కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన వీరమణిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  వారి కుమారుడు హరీశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని బుధవారం తద్ధాన్‌పల్లి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement