సందడిగా యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ లండన్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌ | University of Roehampton London Meet and Greet | Sakshi
Sakshi News home page

సందడిగా యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ లండన్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌

May 15 2026 8:25 AM | Updated on May 15 2026 12:09 PM

University of Roehampton London Meet and Greet

సాక్షి, హైదరాబాద్‌ : మీట్‌ అండ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ లండన్‌ వీసీ జాన్‌ వాల్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ లండన్‌ మీట్‌ గ్రీట్‌ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.బంజారాహిల్స్‌లోని తాజ్‌ దక్కన్‌ హోటల్‌లో గురువారం యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ మీట్‌ ద గ్రీట్‌ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ లండన్‌ వైస్‌ ఛాన్సిలర్‌ జాన్‌ వాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మూస కోర్సులు చదువుకునేందుకు ఇష్టపడటం లేదని ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారని  అన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ యూనివర్సిటీకి భారతీయ విద్యార్థులకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ లభించే కోర్సులకు ప్రతియేటా భారతీయ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. టెక్నాలజీ కోర్సులు, సైబర్‌ సెక్యూరిటీస్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, రొబోటిక్స్‌ వంటి ఎన్నో అంశాలపై అధునాతన కోర్సులను విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అందిస్తున్నదని తెలిపారు.

ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ రొహింప్టన్‌ డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ అడ్మిన్‌ గులిని రిచర్డ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీలో 12 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని అన్నారు. సావరియా ఎడ్యుకేషన్‌ సంస్థ చైర్మన్‌ రాజేష్‌ గోయల్‌ మాట్లాడుతూ తొలుత 200 మంది తమ కన్సల్టెన్సీ నుంచి లండన్‌ వెళ్ళారని ఇప్పుడు 500 మందికిపైగా వెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ ఈడీ గ్రోత్‌ మిస్త్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement