పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్‌ ఆసుపత్రులు: కేటీఆర్ | KTR visited Sanatnagar Tims Hospital | Sakshi
Sakshi News home page

పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్‌ ఆసుపత్రులు: కేటీఆర్

May 15 2026 10:54 AM | Updated on May 15 2026 12:40 PM

 KTR visited Sanatnagar Tims Hospital

సాక్షి, హైదరాబాద్‌:  నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు.

సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇందులో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని 300 ICU బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని  కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement