ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఆత్మహత్య | Female Software Engineers Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఆత్మహత్య

May 12 2026 7:36 AM | Updated on May 12 2026 7:36 AM

Female Software Engineers Ends Life In Hyderabad

మియాపూర్‌:  మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు  మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్‌ మెగా పోలీస్‌  అపార్ట్‌మెంట్‌ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30),  మైత్రీనగర్‌లోని ఫేజ్‌– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. 

కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్‌ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్‌సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్‌ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్‌మన్‌కు సమాచారం ఇచి్చంది.  వాచ్‌ మెన్‌ వెళ్లి తలుపు  తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది.   మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు.   

విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది.  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ మియాపూర్‌ మదీనాగూడలోని మైత్రీనగర్‌లోని ఫేజ్‌– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి  కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు.

 సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్‌ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్‌ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement