రూ.500కే.. జైలు యోగం! | Hyderabad Chanchalguda Jail Museum Lets Visitors Experience Prison Life For ₹500, More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.500కే.. జైలు యోగం!

May 12 2026 8:29 AM | Updated on May 12 2026 10:08 AM

jail life for 500 rupees at hyderabad chanchalguda central jail

చంచల్‌గూడ (హైదరాబాద్‌): సాధారణంగా జైలుకెళ్లాలంటే ఏదో ఒక నేరం చేయాలి.. పోలీసులు అరెస్ట్‌ చేయాలి.. కోర్టు రిమాండ్‌ విధించాలి.. ఇదంతా పాత పద్ధతి. అసలు సిసలైన ‘ఖైదీ’ఫీలింగ్‌ కోసం ఇకపై అలాంటి కష్టాలేమీ పడక్కర్లేదు. కేవలం ఐదు వందల రూపాయలు జేబులో ఉంటే చాలు, చంచల్‌గూడ జైలు గేట్లు మీ కోసం గౌరవంగా తెరుచుకుంటాయి!.. మీరు చదివింది నిజమే. తెలంగాణ జైళ్ల శాఖ ఆలోచనతో చంచల్‌గూడలోని శిక్షణ సంస్థ (సీకా) ప్రాంగణంలో సరికొత్త ‘జైలు మ్యూజియం’కొలువుదీరింది. మంగళవారం ఉదయం గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దీనికి రిబ్బన్‌ కట్‌ చేయగానే, పర్యాటకులు క్యూ కట్టేయొచ్చు.

రూ.500 టికెట్‌ కొంటే,
ఒక్క రోజంతా జైలు వాతావరణాన్ని
అనుభవించవచ్చు. కేసుల భయం లేదు, బెయిల్‌ కోసం తిప్పలు లేవు!

పాత కాలపు శిక్షలు ఎలా ఉండేవి?
జైలు విధానాలు ఏంటన్నవి
పెయింటింగ్స్‌ రూపంలో చూపిస్తూ మనల్ని భయపెడతారు. 
నేను జైలు చూశానని కాలర్‌
ఎగరేయడానికి ఇదో సువర్ణావకాశం.   

Advertisement
 
Advertisement
Advertisement