సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం | Massive Development Funds Allocated to Uppal Constituency | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం

May 11 2026 11:17 AM | Updated on May 11 2026 12:20 PM

Massive Development Funds Allocated to Uppal Constituency

హైదరాబాద్‌: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి రూ.కోట్లాది నిధుల‌ను తెస్తూ అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతున్న‌ట్టుగా చెప్పారు. 

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఉప్ప‌ల్‌, కుషాయిగూడ జిల్లా ప‌రిష‌త్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు అప్‌గ్రేడెష‌న్ కోసం రూ.37.10 కోట్ల నిధుల‌ను మంజూరు చేయించిన‌ట్టుగా చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి గారి ప్ర‌త్యేక చొర‌వ‌తోనే ఇది సాధ్యం అయింద‌న్నారు. దీంతోనే కృత‌జ్ఞ‌త‌గా సీఎం రేవంత్‌రెడ్డి గారి చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం చేసిన‌ట్టుగా చెప్పారు.

ఉప్ప‌ల్‌, ఈసీఐఎల్ ప్రాంతాల‌లో సీఎం రేవంత్‌రెడ్డి గారి చిత్ర ప‌టానికి కాంగ్రెస్ నాయ‌కులు సోమ‌వారం పాలాభిషేకం చేప‌ట్టారు. రెండు ప్రాంతాల‌లో జ‌రిగిన పాలాభిషేక కార్య‌క్ర‌మానికి ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎంత ప్ర‌చారం చేసుకున్నా, ఎన్ని ర‌కాల మాయ‌మాట‌లు చెప్పిన ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డి గారినే న‌మ్ముతార‌ని ఈ సంద‌ర్భంగా ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు కావాల‌న్నా, స్థానిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కావాలన్నా నేరు న‌న్ను లేదా మా పార్టీ డివిజ‌న్ అధ్య‌క్షుల‌ను క‌లిసి ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు.

కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి గారు,సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి గారు,పావని రెడ్డి గారు,స్వర్ణరాజ్ శివమణి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి గారు,సీత రామ్ రెడ్డి గారు ,రాజేందర్ గారు,కాప్రా,చెర్లపల్లి ,మల్లాపూర్,AS రావు నగర్,మీర్పేట్ HB కాలనీ అధ్యక్షులు 
నాగ శేషు గారు,కాశెట్టి ప్రసాద్ గారు,పోలేపక అంజయ్య గారు,కప్రా సాయి గౌడ్,వెంకట్ రెడ్డి జిల్లాకార్యవర్గ సభ్యులు దండల్లా మురళి ,సురేష్,పాకాల రాజు గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్,పూర్ణ యాదవ్  సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement