నీట్‌ పేపర్‌ లీక్‌పై సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్‌ | Cm Revanth Reddy Responded To Neet Paper Leak | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీక్‌పై సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్‌

May 14 2026 3:28 PM | Updated on May 14 2026 3:38 PM

Cm Revanth Reddy Responded To Neet Paper Leak

సాక్షి, హైదరాబాద్‌: నీట్ పేపర్‌ లీక్, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో స్పందించారు. నీట్ పేపర్‌ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలోకి నెట్టారని.. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళనలొ ఉన్నారని ఆయన ట్వీట్‌ చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. పేపర్ లీక్‌, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

‘‘కేంద్ర ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపట్టాలి. వ్యవస్థ వైఫల్యాలతో అమాయక విద్యార్థులు నష్టపోకూడదు. పోటీ పరీక్షలు అవకాశాలకు మార్గం కావాలి గానీ భయానికి కాదు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement