హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమరి్పంచారు.
తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్‌లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు.


