బండి భగీరథ్‌తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి | The party has no connection with Bandi Bhagirath: Kishan Reddy | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి

May 17 2026 2:25 PM | Updated on May 17 2026 3:09 PM

The party has no connection with Bandi Bhagirath: Kishan Reddy

సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్‌ ఇదివరకే సరెండర్‌ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్‌ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.

అయితే కేంద్రమంత్రి బండిసంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.

కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్‌.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement