రాజన్న సిరిసిల్లా జిల్లా, సాక్షి: గంభీరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గజ సింగవరం స్టేజివద్ద ఓ స్కార్పియో ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందంది. మరో మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.


