పోక్సో కేసులో కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు | Hyderabad POCSO Court Sentences Ex-Constable To 31 Years Imprisonment In Boinpally Sexual Assault Case | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు

May 16 2026 9:01 AM | Updated on May 16 2026 2:20 PM

 Constable 31 Years Jail To Accused In POCSO Case

హైదరాబాద్: బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్‌కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో నిందితుడు వరదరాజ్‌ సుదేశ్‌కు 31 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదనంగా బాధిత బాలికకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 

పోలీసులు తెలిపిన మేరకు.. 2020లో డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వరదరాజ్‌ సుదేశ్‌ బోయిన్‌ నపల్లి తాడుబండ్‌ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. ఆరు సంవత్సరాల అనంతరం నేరం నిరూపణ కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement