హనుమకే అరటి దండ దక్కితే! | Devotees Throng Temples on Hanuman Jayanti | Sakshi
Sakshi News home page

హనుమకే అరటి దండ దక్కితే!

May 13 2026 11:24 AM | Updated on May 13 2026 12:29 PM

Devotees Throng Temples on Hanuman Jayanti

హైదరాబాద్‌ : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని   రామాలయాలు, అంజన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.  కూకట్‌పల్లిలో హనుమంతుడిని ప్రత్యేకంగా అరటి పండ్ల దండలతో ఇలా అలంకరించారు.   
    – కూకట్‌పల్లి

అధికారులే అడ్డంపడితే..!
ఆ రహదారులు.. అధి‘కారు’లకు అడ్డాగా మారాయి. ఇతర వాహనదారులకు ఆటంకంగా ఉన్నాయి. గీతానగర్‌లోని మల్కాజిగిరి సర్కిల్, జోనల్‌ కార్యాలయాలున్న భవనం ముందున్న రహదారులు పార్కింగ్‌ స్థలాలుగా మారిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులకు 
గురవుతున్నారు.     
 – మల్కాజిగిరి  

గాం«దీలో అగ్గి పుడితే..
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అసిస్టెంట్‌ డిస్టిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ భాను ప్రతాప్‌ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఫైర్‌సేఫ్టీ అవేర్‌నెస్, మాక్‌ ఎవాక్యుయేషన్‌ డ్రిల్‌ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొ.వాణి, ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్లు మహ్మద్‌  షౌకత్‌ అలీ, రమే‹Ù, భిక్షపతి పాల్గొన్నారు.     
 – గాం«దీఆస్పత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement