ఏడు తరాలకు సజీవ సాక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఏడు తరాలకు సజీవ సాక్ష్యం

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

700 ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో అంతు చిక్కని మహా వృక్షంగా ఎదిగింది. నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న మహా (మర్రి) వృక్షం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. నిండు వేసవితాపం నుంచి ప్రజలకు చల్లటి నీడనిస్తూ వారిని తన నీడలో సేద తీరేందుకు పిల్లలమర్రి తన ఒడిలో చేర్చుకుంటోంది. మహబూబ్‌నగర్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి పిక్నిక్‌ స్పాట్‌లా అందరిని అలరిస్తుంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగు లాంటి ఈ భారీ మర్రివక్షం వయస్సు సుమారు 700 ఏళ్లు ఉంటుందని చెబుతారు. పిల్లలమర్రి ఎదుట ఉన్న పురావస్తు ప్రదర్శనశాలలో పూర్వపు రాజులు, రాణులు వాడిన వస్తువులతో పాటు పలు రకాల చారిత్రక అనవాళ్లుగా చెప్పబడే రాతి విగ్రహాలను భద్రపర్చారు. 10 వేల సంవత్సరాల కిందటి రాతివిగ్రహాలు ఉన్నాయి. 18, 19 శతాబ్దాలోల శాతవాహనుల కాలంలో వాడుకల్లో ఉన్న నాణేలను మ్యూజియంలో ఉంచారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో బయటపడిన శిలాలను మ్యూజియంలో భద్రపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement