● బిహార్ నుంచి బాలానగర్‌కు సరఫరా
● కిలో రూ.5వేలకు తెచ్చి
రూ.60వేలకు విక్రయం
రాజాపూర్(బాలానగర్): బిహార్ నుంచి గంజాయిని తీసుకొచ్చి బాలానగర్ మండలంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్యాకెట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని శనివారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి శనివారం కేసు వివరాలను వెల్లడించారు. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన ఉపేందర్ 18ఏళ్లుగా బాలానగర్ మండల కేంద్రంలో ఉంటూ పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు గంజాయికి అలవాటుపడ్డ ఉపేందర్ బీహార్ నుంచి కిలో రూ.5వేలకు తీసుకొచ్చి బాలానగర్‌లో ప్యాకెట్లుగా చేసి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కో ప్యాకెట్ రూ.400–500 వరకు విక్రయిస్తున్నాడు. శనివారం బాలానగర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించగా.. ఇంటిముందున్న స్కూటీలో 3.150 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని విచారించగా.. బీహార్‌లో కిలో గంజాయి రూ.5వేలకు తీసుకొచ్చి ఇక్కడ కిలో రూ.60వేలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పట్టుపడ్డ గంజాయితోపాటు స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసునమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి, ఎస్‌ఐలు నాగరాజు, కార్తీక్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ప్రకాష్, ప్రవీన్, పాషా పాల్గొన్నట్లు తెలిపారు. గంజాయి సేవించిన, విక్రయించిన తమకు 9030019949–8712658866కి సమాచారం ఇవ్వాలని సూచించారు.


