బేసిక్ అంశాలపై దృష్టి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈ ఏడాది పలు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇండోర్ స్టేడియంలో వేసవి షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ శిబిరంలో 45 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మంది విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు.
ఈ శిబిరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు బేసిక్ అంశాలపై శిక్షణా ఇవ్వడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముందుగా వార్మప్, ఫిట్‌నెస్ అనంతరం రాకెట్స్ ఎలా పట్టుకోవాలి, స్వింగ్ ఎలా ఇవ్వాలో, లిఫ్టింగ్, సర్వీస్ చేయడం, నిలబడే విధానంపై శిక్షణ అందజేస్తున్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విద్యార్థులకు ప్రత్యేక మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.


