రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పౌర్ణమికి రెండు పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పౌర్ణమికి రెండు పతకాలు

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

మిడ్జిల్‌: హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి మూడో అథ్లెటిక్స్‌ పోటీల్లో మిడ్జిల్‌ మండలంలోని మల్లాపూర్‌ గ్రామానికి చెందిన పౌర్ణమి అద్భుత ప్రతిభ చాటి ఓ స్వర్ణపతకంతో పాటు ఓ కాంస్య పతకం సాధించింది. డిస్కస్‌త్రో ఈవెంట్‌లో 29.69 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే షాట్‌పుట్‌లో 8.49 మీటర్లు విసిరి మూడో స్థానంతో కాంస్య పతకం పొందింది. ఈ సందర్భంగా పౌర్ణమికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

ఎప్‌సెట్‌ కేంద్రం తనిఖీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జేపీఎన్‌సీ కళాశాలలో జరుగుతున్న ఎప్‌సెట్‌ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌ ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 360 మంది విద్యార్థులకు 345 మంది హాజరయ్యారు. వారి వెంట కళాశాల పరీక్షల నిర్వహణ అధికారి కోటాల సందీప్‌ పాల్గొన్నారు.

కొత్త కోర్సుల్లో చేరండి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్‌ఎస్‌ఐ, బీబీఏలో రీటైల్‌ ఆపరేషన్స్‌, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్‌ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్‌ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్‌గా ఎంవీఎస్‌ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్‌, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

ఇస్కాన్‌ మందిరంలో నౌకా విహార్‌ ఉత్సవాలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీ ఇస్కాన్‌ జగన్నాథ మందిరంలో శ్రీరాధా శ్యాంసుందర్‌ నౌకావిహార్‌ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం మ్యాంగో ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ గురువు వరదరాజ్‌ దాస్‌ప్రభు మాట్లాడుతూ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను పడవతో విహరింపజేయడం, వేసవి తాపాన్ని తగ్గించడానికి స్వామికి చందనం, నీటితో సేవలందించడమే నౌకావిహార్‌ విశేషమన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మామిడిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో విజయ వెంకటేశ్వరదాస్‌ ప్రభు, రఘునాథ్‌ ప్రభు, రసమయ హరిదాస్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement