ప్రజలపై ఆర్థిక భారం మోసిన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

ప్రజలపై ఆర్థిక భారం మోసిన కేంద్రం

May 16 2026 1:03 AM | Updated on May 16 2026 1:03 AM

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించి ఎన్నికల ముగిసిన వెంటనే ఒక్కసారిగా ధరలు పెంచి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపింది. గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు పెరిగినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ధరలు నియంత్రించి ప్రజలపై అదనపు భారం పడకుండా చూసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి దాని ప్రభావం నిత్యావసరాల వస్తువుల ధరలపై పడుతుంది. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ధరల పెంపును పునఃసమీక్షించి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి.

– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement