మహబూబ్‌నగర్ క్రైం: చించోళి బైపాస్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. నగర పరిధిలో నూతనంగా నిర్మించిన చించోళి బైపాస్‌పై ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం బ్లాక్‌స్పాట్ ఏరియాలను పరిశీలించారు. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులతోపాటు జాతీయ రహదారి అథారిటీ అధికారులతో మాట్లాడారు. రోడ్డుపై ప్రమాద సూచిక బోర్డులు, రాత్రివేళలో వాహనదారులకు స్పష్టంగా కన్పించే విధంగా రేడియం స్టిక్కర్లు అమర్చాలన్నారు. వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం, డివైడర్ల వద్ద హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర మలుపుల దగ్గర ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అతివేగం, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,381
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటా గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,109 ధరలు లభించాయి. అలాగే హంస సరాసరిగా రూ.1,789, ఆముదాలు సరాసరిగా రూ.6,082 ధరలు వచ్చాయి. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
సస్పెన్షన్‌తో సరిపెట్టారు!
● అక్రమాలు నిగ్గు తేల్చడంలో అలసత్వం
● ఫిర్యాదులపై మాత్రమే విచారణ
● పూర్తిస్థాయి విచారణలో జాప్యం
● రికవరీలో మరిన్ని అక్రమాలపై అనుమానాలు


