‘సీడ్‌, ఫెర్టి డ్రిల్‌’తో సాగు సులభం | - | Sakshi
Sakshi News home page

‘సీడ్‌, ఫెర్టి డ్రిల్‌’తో సాగు సులభం

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

విత్తనం, ఎరువులు ఒకేసారివేసుకునే అవకాశం

కూలీల సమస్యకు చెక్‌

దిగుబడి ఆశాజనకమే..

రకం వరుసల మొక్కల

మధ్య మధ్య

వరి 25 15

మొక్కజొన్న 60 20

పామాయిల్‌ 60 20

పెసర 25 10

గోగు 25–30 15

వేరుశనగ 30 15

అలంపూర్‌: జిల్లాలో రైతులు సాగులో ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగలి వెనుక సాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగుచేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. పెర్టికమ్‌ సీడ్‌ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌రెడ్డి రైతులకు సూచించారు. ఈ విధానంతో కూలీల సమస్యను అధికమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సీడ్‌ డ్రిల్‌ యంత్రంతో సాగు పద్ధతుల గురించి ఏఓ మాటల్లో..

ఫెర్టికమ్‌ సీడ్‌ డ్రిల్‌ వల్ల ఉపయోగాలు

● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్‌తో వేయవచ్చు.

● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చును.

● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది.

● పంటను బట్టి వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం మార్చుకోవచ్చు.

● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వల్ల పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.

● పంటకు గాలి వెలుతురు బాగా తగిలి ఆరోగ్యంగా ఉంటుంది.

● యంత్రాలతో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ముశనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు.

● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి.

● చివరి దుక్కిలో రోటోవేటర్‌ ఉపయోగించాలి.

● పొలం చదునుగా ఉంటే పొలం అంతా విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది.

● ఈ యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది.

సీడ్‌డ్రిల్‌తో సాగు సీడ్‌ డ్రిల్‌ యంత్రంలో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్‌లో ఎరువులు వేయాలి. రెండో బాక్స్‌లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది.

పాటించాల్సిన దూరం (సెం.మీ)

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement