షీటీంలతో ఆకతాయిలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

షీటీంలతో ఆకతాయిలకు చెక్‌

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

మహబూబ్‌నగర్‌ క్రైం: అమ్మాయిలు, మహిళా రక్షణతో పాటు చిన్నారులపై జరిగే వేధింపులకు గురి చేసే వారిపై పోలీస్‌ శాఖ నిరంతర నిఘా ఉంచుతోంది. యూనిఫాం లేకుండా జనసంచారంలో ఉంటూ ఆకతాయిల ఆట కట్టించడానికి ఏర్పాటు చేసిన షీటీం సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, కళాశాలలు, మార్కెట్‌లలో నిఘా వ్యవస్థ పని చేస్తోంది. వేసవి సెలవుల్లో ఖాళీగా తిరిగే ఆకతాయిల ఆట కట్టించేందుకు పోలీస్‌శాఖ షీటీం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.

జిల్లాకేంద్రం బస్టాండ్‌లో విద్యార్థులకు

అవగాహన కల్పిస్తున్న ఎస్పీ జానకి (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement