11 నుంచి ఉచిత క్రికెట్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

11 నుంచి ఉచిత క్రికెట్‌ శిక్షణ

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

వేదిక ఇన్‌చార్జి సెల్‌ నం.

ఎండీసీఏ మైదానం, మహబూబ్‌నగర్‌ ఆబిద్‌ 99482 74760

డీఎస్‌ఏ మైదానం, నారాయణపేట రమణ 91007 53683

డీఎస్‌ఏ మైదానం, కల్వకుర్తి ఎం.సుధాకర్‌ 96406 00329

డీఎస్‌ఏ మైదానం, గద్వాల శ్రీనివాస్‌ 77806 90883

డీఎస్‌ఏ మైదానం, జడ్చర్ల మోయిన్‌ 99853 75737

పీజేపీ మున్సిపల్‌ మైదానం, పెబ్బేరు చరణ్‌ 76748 88101

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హెచ్‌సీఏ సౌజన్యంతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ నెల 11 జూన్‌ 10 వరకు వేసవి ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి శివారు క్రికెట్‌ మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న మహబూబ్‌నగర్‌ ఎండీసీఏ మైదానం, జడ్చర్ల, 12న నారాయణపేట, గద్వాల, 13న పెబ్బేరు, కల్వకుర్తి పట్టణాల్లో శిబిరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆయా కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్‌లు శిక్షణ అందిస్తారని, క్రీడాకారులకు జంబో కిట్‌, వివిధ రకాల బాల్స్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కిట్లు అందజేస్తామన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కోచింగ్‌ ఉంటుందని, క్రీడాకారులకు అల్పాహారం అందిస్తామన్నారు. అండర్‌– 14, 16, 19, 23 విభాగాల క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో ప్రతిభగల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలను ఔత్సాహిక క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని సూచించారు. సమావేశంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకష్ణ, మన్నాన్‌, ఆబిద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

వేసవి ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాల వివరాలు

ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి శిబిరాలు

Advertisement
 
Advertisement
Advertisement