నవాబుపేట: మండల కేంద్రంలో ప్లాస్టీక్ సామన్ల వ్యపారం నిర్వహించే ఒక మహిళ అదృశ్యం కావడంతో గురువారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అనగొంది వెంకటయ్య భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ఆయన ప్రమీల అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, ఆయనతోపాటు తన భార్యతోపాటు తన సోదరుడి కుమారుడు సైదులును వ్యాపారానికి తోడుగా తీసుకెళ్లేవాడు. కాగా, గతనెల 8వ తేదీన భార్యతోపాటు సైదులు ఇద్దరు మాత్రమే వ్యాపారానికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడ వెతికిన వారి ఆచూకీ లభించలేదు. దీంతో తాజాగా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


