అయిజ: మతిస్థిమితంలేని వ్యక్తి వడదెబ్బతో మృతిచెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామస్తులవారి కథనం ప్రకారం.. మతిస్థిమితంలేని వ్యక్తి హిందీ మాట్లాడుతూ.. 10రోజులుగా మండలంలోని ఎక్లాస్‌పురం, దేవబండ శివార్లలో తిరుగుతూ ఉన్నాడు. గురువారం ఎండ తీవ్రతకు తాలలేక మండలంలోని దేవబండ సమీపంలోని భారత్ మాల రోడ్డుకు సంబంధించిన ఫ్‌లైఓవర్ బ్రిడ్జి కింద మృతిచెందాడు. ఎస్‌ఐ మల్లేష్ పోలీస్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


