ఫోన్ చేయాల్సిన నంబర్: 94413 57967
తేది: 11–05–2026, సమయం: సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జనగణన– 2027లో భాగంగా ఆదివారం (మే 10)వరకు స్వీయగణనలో ప్రజలు వివరాలు నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సెన్సెస్‌పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేయాలని సూచించారు. జనగణన ప్రక్రియను సులభంగా, సమ గ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభు త్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్‌లైన్‌ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా న మోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు కలెక్టర్ వివరించారు. జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్‌ఈఐడీ) జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డీఎస్‌ఓ గంప శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం రవినాయక్, జిల్లా సహకార అధికారి కృష్ణ, డీఏఓ బి.వెంకటేష్, డీఈఓ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ కె.రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు మే10 వరకు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.


