నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్‌కై నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
– ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్‌నగర్


