ఎప్‌సెట్‌లో విద్యార్థుల ‘ప్రతిభ’ | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌లో విద్యార్థుల ‘ప్రతిభ’

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఎప్‌సెట్‌ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఈమేరకు అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో మహబూబ్‌ ఇరామ్‌ 290, సరిత 326, సాహితి 444, మనీష 468, మనీష్‌ 520, ఆనంద్‌ 782, సుభప్రద 817, సహస్ర 957, కె.సహస్ర 985 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో తనూజ 948, భరత్‌కుమార్‌రెడ్డి 1,026, ఫహదుద్దీన్‌ 1,316, సాయికీర్తన్‌ 1,479, వికాస్‌రెడ్డి 1,876, భానుప్రసాద్‌ 2,466, సాయిఫరూక్‌గౌడ్‌ 2,644, శ్రీ హరిహరణ్‌ 3,336, విజయలక్ష్మి 3,436వ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్‌లో 5వేలలోపు ర్యాంకులు సాధించిన వారు 48, ఇంజినీరింగ్‌లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారు 64మంది ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ వెంకటరమణయ్య తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement