11మంది బైకర్లపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

11మంది బైకర్లపై కేసు నమోదు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

ఫంక్షన్‌ నిర్వాహకుడు

జహంగీర్‌పై కూడా..

మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి

పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్న

రూరల్‌ పోలీసులు

మహబూబ్‌నగర్‌ క్రైం: బైపాస్‌ రోడ్డుపై పాలకొండ చౌరస్తా వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న కారును స్పోర్ట్స్‌ బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. గాయపడిన వారిలో రేష్మా ఖాతూమ్‌ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె దవడ భాగం పూర్తిగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిసింది. ఆమె కొడుకు శ్రీకృష్ణ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గౌసియా బేగం జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెకు ఊపిరితిత్తుల్లో కొంత మేర పక్కటెముకలు విరిగినట్లు సమాచారం. మహ్మద్‌ బాసిత్‌ ఇంటి దగ్గర ఉండగా ఇతని మరో కొడుకు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైడర్ల మృతదేహలను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ముగ్గురి మృతదేహలను మంగళవారం ఉదయం 5.30 ప్రాంతంలో వారి సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.

12 మందిపై కేసు నమోదు

బైక్‌, కారు రోడ్డు ప్రమాద ఘటనలో మొత్తం 12 మందిపై 304–పార్ట్‌ 2 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. 11 మంది బైక్‌ రైడర్లతో పాటు మెట్రో ఫంక్షన్‌ హాలులో ఫంక్షన్‌ చేసిన జహంగీర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫంక్షన్‌ హాల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి బైకర్లు రేస్‌ పెట్టుకున్నారా? లేదా అనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement