రండి.. విశేషాలు పంచుకుందాం
ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలి మృతి
● భక్తిశ్రద్ధలతో గంధోత్సవం
● సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు
శ్రీజ
మూడో తరగతి, గంగారం
(బిజినేపల్లి
మండలం)
నాగర్‌కర్నూల్
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు.
నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని రిటైర్డ్ పోస్టుమాస్టర్ నరసింహసాగర్ నివాసంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను కట్టిపడేస్తోంది. దీనిని ఫుట్‌బాల్ లిల్లీ అని, బ్లడ్ లిల్లీ అని కూడా అంటారు. ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క.సాధారణంగా మే నెలలో మాత్రమే పూసే ఈ పుష్పం ఎర్రటి రంగులో, గుండ్రంగా బంతి ఆకారంలోఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో వికసించే ఈ ‘మే ఫ్లవర్’ ఏడాది పొడవునా మొక్క దశలో ఉండి, కేవలం ఈ సీజన్‌లో మాత్రమే తన అందాలను వెదజల్లుతుంది. – కందనూలు
వైభవంగా షా అలీ పహిల్వాన్ ఉర్సు
కొత్తకోట రూరల్: ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాచారంపేట శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందంగౌడ్ కథనం ప్రకారం...పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామానికి చెందిన సాయితేజ(19) అదే గ్రామానికి చెందిన గోపాల్ ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా ఈనెల 9న ట్రాక్టర్ ఇంజన్‌కు గడ్డి చుట్టే యంత్రాన్ని తీసుకొని కొత్తకోట మండలం నాచారంపేటలో ఓ రైతు పొలంలో గడ్డి చేట్టేందుకు సాయితేజ వెళ్లాడు. రోజంతా పనిచేసి సాయంత్రం 7 గంటల సమయంలో స్వగ్రామానికి ట్రాక్టర్‌తో తిరుగు ప్రయాణం అయ్యాడు. నాచారంపేట గ్రామ శివారులో కాల్వలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో సాయితేజ అక్కడిక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసలకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కాల్వలో నుంచి బయటకు తీసి వనపర్తి మార్చూరీకి తరలించి ట్రాక్టర్ యజమానికి సమాచారం అందించారు. మృతుడి తండ్రి శేరుమీది రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దర్గాలో గంధోత్సవం నిర్వహించారు. గుల్బార్గా నుంచి తీసుకొచ్చిన గంధాన్ని మేళతాళాల మధ్య సయ్యద్‌ఖాదర్ బాషా ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మత పెద్దలు, తహసీల్దార్ ప్రభాకర్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నుంచి మత పెద్దలు గంధం శిరస్సుపై పెట్టుకొని సర్ ముబారక్ దర్గా, ధడ్‌ముబారక్ దర్గాలకు తీసుకెళ్లి గంధోత్సవ ఘట్టాన్ని ముగించారు.
ఘనంగా చిన్న కిస్తీ పోటీలు
ఉత్సవాల్లో హజ్రత్ షా అలీ పహిల్వాన్ సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు నిర్వహించగా.. యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు ప్రసాదాన్ని కిస్తీలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు. పహిల్వాన్లు పోటీ పడి కిస్తీ పోటీలు కొనసాగించారు. ఈ సందర్భంగా పహిల్వాన్లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మతసామరస్యాన్ని చాటుతూ భక్తులు తరలి వచ్చి దర్గాల్లో మొక్కులు చెల్లించి, ప్రార్థనలు చేశారు.
నేడు పెద్ద కిస్తీలు
ఉత్సవాలను పురస్కరించుకొని ధడ్ ముభారక్ దర్గాలో సోమవారం పెద్ద కిస్తీ పోటీలు జరగనున్నాయి. పెద్ద కిస్తీ పోటీలు వీక్షించడానికి భక్తులు భారీగా వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
రెండు చోరీ కేసులు నమోదు
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని పలుచోట్ల జరిగిన రెండు చోరీ కేసులు నమోదు చేసినట్లుగా ఆదివారం ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా.. చారకొండ మండలంలోని సిర్సనగండ్లకు చెందిన ఖాజాభాను సుమారు మూడున్నర తులాల బంగారం లాంగ్ చైన్‌ను బ్యాగ్‌లో పెట్టుకొని ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో లగేజీ బ్యాగును బస్సులోని ర్యాక్‌లో పెట్టి ముందుకు వచ్చి నిలబడింది. కల్వకుర్తిలో బస్సు దిగిన తర్వాత దిగి బ్యాగును చూడగా, అందులో పెట్టిన బంగారు గొలుసు కనపడకపోవటంతో వెంటనే కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇంటి తాళం పగలగొట్టి..
పట్టణంలోని మార్గదర్శి కాలనీలో నివాసముండే లక్ష్మి తన భర్త గోపాల్‌కు అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రిలో చూయించేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. బంధువైన మంగమ్మకు ఇంటి తాళం ఇచ్చి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ఆదివారం ఇంటిపైన ఉన్న బెడ్‌షీట్స్ తీసేందుకు మంగమ్మ అక్కడికి వెళ్లగా.. ఇంటి తలుపులకు ఉన్న తాళం విరగగొట్టి ఉండటం చూసి లక్ష్మికి సమాచారం ఇచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారు ఉంగరాలు, రెండు చిన్న ఉంగరాలు, మహాలక్ష్మి పొదుపు సంఘం డబ్బులు రూ.1.40లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
ఖిల్లాఘనపురం: విద్యుదాఘాతంతో వేరు వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన జోగు బక్కన్న తన ఇంటికి మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. సిమెంటు చేసిన గోడలకు నీరు పట్టేందుకు ఆయన కుమారుడు జోగు మహేష్ (22) శనివారం రాత్రి సమయంలో సింగిల్ ఫేస్ మోటార్ పెట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు అతడి చేయికి తగిలి విద్యుదాఘాతానికి గురి కాగా.. కుటుంబ సభ్యులు బాధితుడిని ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడే వైద్యం పొందుతూ.. శనివారం రాత్రే మృతి చెందాడు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఆముదంబండ తండాలో..
ఖిల్లాఘనపురం మండలంలోని ఆముదంబండతండాలో ఆదివారం ఉదయం కేతావత్ బాబు (28) ఇంటి ఆవరణలో ఉన్న మోటార్ ఆన్ చేసి బైక్ కడుగుతున్నాడు. ఈ సమయంలో ప్లగ్ వద్ద వైరు తేలి ఉండటంతో ఒక్కసారిగా షాక్ వచ్చింది. బాబు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స కోసం ఖిల్లాఘనపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.
కెతావత్ బాబు (ఫైల్)
జోగు మహేష్ (ఫైల్)
తెలకపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి పెద్దచెరువులో అదివారం మధ్యాహ్నం మహిళ వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో స్థానికులే చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. లింగాల మండలం వల్లాభాపూర్ గ్రామానికి చెందిన కిష్టమ్మ(75)గా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానిక తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులను వివరాలు అడగగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
కనువిందు చేస్తున్న మే పుష్పం


