పోయేదంతా బంగారమే.. | - | Sakshi
Sakshi News home page

పోయేదంతా బంగారమే..

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

● సెలవుల్లో కుటుంబ సభ్యులు ఊరెళ్లినప్పుడు ఆభరణాలకు రంగులు, మెరుగులు అద్దుతాం అంటూ ఇళ్లకు వచ్చే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వచ్చినవారి ప్రాంతం, వారి గుర్తింపు కార్డులు చూడాలి.

● మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇల్లు, గదులు అద్దె కోసం వచ్చినవారికి లేవని చెప్పడమే శ్రేయస్కరం.

● అనుమానాస్పద వ్యక్తులు కాలనీల్లో సంచరిస్తుంటే 100కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ఈ జాగ్రత్తలు పాటించాలి..

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రస్తుతం పసిడి ధరలు అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు అదేస్థాయిలో చోరీలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంట్లో దాచుకున్న బంగారం, వెండి, నగదును పెద్దఎత్తున దోచుకెళ్తున్నారు. తీర్థయాత్రలు, స్వగ్రామాలు, ఇతర శుభకార్యాలయాలకు వెళ్తున్న వారు ఇళ్ల్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు కన్నం వేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు నలుగురిలో గుర్తింపు కోసం కష్టపడి దాచుకున్న బంగారం, అవసరాలకు కూడబెట్టుకున్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు వాటిని ఒక్కరాత్రిలో దోచుకుంటే.. ఆర్థికంగా వారు కొన్నేళ్లు వెనక్కు వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తోంది.

పగలు రెక్కీ.. రాత్రికి చోరీ

ఏడాదిన్నర కాలంలో 232 కేసులు నమోదు

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా దొంగతనాలు

బాధితులు కోల్పోయేది రూ.కోట్లలో.. రికవరీ రూ.లక్షల్లో

నగర శివారు కాలనీలతోపాటు దొంగల హల్‌చల్‌

అరికట్టడంలో విఫలమవుతున్న పోలీస్‌ శాఖ

ఎక్కువ రోజులు ఊరెళ్తే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం మంచిది.

ప్రధాన ద్వారాలు కాకుండా ఇతర ద్వారాలు ఉంటే వాటికి తాళం వేస్తూ మిగతా వాటికీ లోపలి భాగాలకు తాళం వేయాలి. అలా వేయడంతో ఇంట్లోని వాళ్లు ఊరు వెళ్లారనే అనుమానం రాకుండా ఉంటుంది.

ఇంట్లో లేకున్నా గదుల్లో విద్యుత్‌ దీపాలు వేసి ఉంచాలి. దీంతోపాటు తాళం వేసిన ద్వారాలకు పరదాలు, కర్టెన్లు వేస్తే కనబడకుండా ఉంటాయి.

విలువైన ఆభరణాలు, నగదు వెంట తీసుకెళ్లా లి. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి.

రాత్రిపూట ఒంటరిగా వెళ్లాల్సి వస్తే మహిళలు తక్కువగా ఆభరణాలు ధరించాలి.

ఊరెళ్లే ముందు బైక్‌లు ఆరుబయట, ప్రహరీ లోపల, ఇంటి ముందు పెట్టి వెళ్లకూడదు. వాహనానికి జాగ్రత్తగా తాళం వేసి సుపరిచితుల ఇళ్లలో పెట్టడం చాలా మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement