నగరంలో ఉన్న అతి ప్రధానమైన బైపాస్ రోడ్డు 5.5 కిలోమీటర్ల దారిలో ఇరువైపులా మూడు బార్లు, 8 దాబాలు, 9 టీ పాయింట్స్, పదిలోపు చిన్నపాటి హోటళ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా పిస్తాహౌస్ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉండటంతో నగరంతో పాటు జడ్చర్ల, హైదరాబాద్ వైపు నుంచి వెళ్లే చాలామంది యువకులు రాత్రి 11 గంటల తర్వాత ఇక్కడ కలుస్తుంటారు. పిస్తాహౌస్ సమయపాలనపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన యువత బైపాస్ మార్గంలో బైక్‌లపై చక్కర్లు కొడుతుంటారు. దాబాల్లో లభించే మద్యం కారణంగా గ్రూప్‌లు, గ్రూప్‌లుగా చేరుకొని మద్యం తాగుతూ హల్‌చల్ చేస్తుంటారు. బైపాస్‌లో పోలీసుల పాయింట్స్ లేకపోవడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కేవలం పిస్తాహౌస్ చౌరస్తాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రమే ఉంటారు.
న్యూటౌన్‌లోని రోడ్డుపై ద్విచక్రవాహనాల పార్కింగ్


