నెలరోజుల కిందట కొనుగోలు కేంద్రానికి 266 బస్తాల మొక్కజొన్న తీసుకొచ్చా. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజూ పనులు మానుకుని కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నా.. శుక్రవారం బస్తాలను తూకం వేయడంతో ట్రాక్టర్‌లో తానే స్వయంగా గోదాం వద్ద అన్‌లోడ్ చేసేందుకు తీసుకెళ్లా. గోదాం ఖాళీ లేదంటూ వెనక్కి పంపారు.
– మైబు, రైతు, గంగాపూర్
25రోజులుగా ఇబ్బందులు
మొక్కజొన్న పంటను అమ్ముకుపోదామని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. 150 బస్తాలను ఇక్కడికి తెచ్చి 25రోజులు గడించింది. అయినా కొనుగోలు చేయక పడాగాపులు పడుతున్నాం. ఇంటి వద్ద కుటుంబం, వ్యవసాయ పనులు పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. రేపుమాపు అంటున్నారే తప్పా.. కొనడంలేదు. దీంతో నరకం అనుభవిస్తున్నాం.
– వెంకటయ్య, రైతు, లింగంపేట
●


