ఎప్‌సెట్‌లో సత్తాచాటిన వాగ్దేవీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌లో సత్తాచాటిన వాగ్దేవీ విద్యార్థులు

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఎప్‌సెట్‌ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవీ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులు రబ్‌షా 1,946, సన 3,982, కౌషిక్‌ 4,035, మౌనిక 4,522, తిరుపతమ్మ 5,853, పాయల్‌సింగ్‌ 6,461, సంజన 7,140, అజీజ్‌ 9,805, స్ఫూర్తి 9,927, సాధించారు. వీరితోపాటు 15వేల ర్యాంకులోపు 24, 20వేలలోపు 35 మంది ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్‌ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సాధించాలన్న తపన విద్యార్థుల్లో ఉంటే సాధింపజేసే సంకల్పం అధ్యాపకుల్లో ఉందని, ఇంతటి ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులను అభినదిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతినందన్‌రెడ్డి, షాకీర్‌, సతీష్‌రెడ్డి, హుస్సేన్‌, రత్నాకర్‌, గోవిందరాజులు, షబ్బీర్‌ అహ్మద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement