ప్రతిరోజు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ప్రతిరోజు తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– లక్ష్మమ్మ, కావేరమ్మపేట
తాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నీళ్ల సమస్యల కారణంగా బ యటి పనులకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. తెల్లారితే నీళ్ల సమస్యతో సతమత మవుతున్నాం. ప్రతిరోజు తాగునీటిని సకాలంలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– మణెమ్మ, ఆదర్శనగర్
●


