●
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పలు క్రీడలకు సంబంధించి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్ శిబిరంలో విద్యార్థులు, యువత పాల్గొని శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు సీనియర్ క్రీడాకారులు చక్కగా మెళకువలు నేర్చుకుంటూ సత్తాచాటుతున్నారు.
40 మంది క్రీడాకారులు
హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరంలో దాదాపు 40 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు కొత్తగా హ్యాండ్‌బాల్ శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొదట క్రీడాకారులకు వార్మప్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం హ్యాండ్‌బాల్ టెక్నిక్‌పై అవగాహన కల్పిస్తున్నారు. హ్యాండ్‌బాల్ క్రాసింగ్, టూమెన్, త్రీమెన్ పాసింగ్‌తోపాటు వివిధ స్థానాల నుంచి షూటింగ్ ప్రాక్టిస్ చేయిస్తున్నారు. కొత్తగా వచ్చిన విద్యార్థులకు రీక్రియేషన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో చిన్నారులు, సీనియర్ క్రీడాకారులను జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిస్తారు.
టెక్నిక్స్‌పై అవగాహన..
ఈ సంవత్సరం మొదటిసారి వేసవి హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నా. ఇక్కడ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. హ్యాండ్‌బాల్ బేసిక్ టెక్నిక్ అంశాలపై అవగాహన పెంచుకుంటున్న.
– సాయి సాహితి, మహబూబ్‌నగర్
పాలమూరు
మెయిన్ స్టేడియంలో వేసవి శిబిరం
ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్న యువత
జూనియర్, సీనియర్ జట్లుగా విభజించి మ్యాచ్‌లు
కొత్తగా వస్తున్న వారిపై నిర్వాహకుల ప్రత్యేక దృష్టి


