అమ్మ ప్రోత్సాహం.. నాన్న సహకారం | - | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రోత్సాహం.. నాన్న సహకారం

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

అమ్మ ప్రోత్సాహం.. నాన్న సహకారం

నారాయణపేట రూరల్‌: తెలంగాణ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎప్‌ సెట్‌) ఫలితాల్లో నారాయణపేటవాసి ప్రతిభ చాటాడు. పట్టణంలోని గాయిత్రీనగర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతుల కుమారుడు శేర్‌ గురుచరణ్‌రెడ్డి 122.411432 మార్కులతో రాష్ట్రస్థాయిలో 82వ ర్యాంక్‌ సాధించాడు. తల్లి పారిజాత ఊట్కూరు బాలికల పాఠశాలలో పీఈటీ, తండ్రి దామరగిద్ద మండలం కానుకుర్తి ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం. గురుచరన్‌డ్డి నారాయణపేటలో టెన్త్‌ పూర్తిచేసి 9.5జీపీఏ పొంది, ఇంటర్‌ హైదరాబాద్‌లో చదువుకుని 985మార్కులు సాధించాడు. డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్‌, ఎంఈఓలు, తపస్‌ నాయకులు అభినందించారు. పరీక్ష అనంతరం గురుచరణ్‌ రెడ్డికి తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి తీపి కబురు చెప్పారు. గురుచరన్‌రెడ్డి మాట్లాడుతూ.. తన విజయం వెనక అమ్మ ప్రోత్సాహం, నాన్న సహకారం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement