మక్తల్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని రైల్వేస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మక్తల్‌కు చెందిన జుట్లు వాసు(25) ఇంటర్ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్‌లో కొందరు దళారులు ఓ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.20 వేలు వాసు వద్ద తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో హైదరాబాద్ నుంచి సోమవారం మక్తల్‌కు వచ్చాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లిన వాసు మోసపోయానన్న మనస్తాపంతో స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొని...ఇద్దరు మృతి
సనత్‌నగర్: బైక్‌పై దూసుకెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోడూరుకు చెందిన వాకిటి కుమార్ కుమారుడు సందీప్ (26) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ మహేంద్రహిల్స్‌లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌషిక్ (24) కూడా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ రామంతాపూర్‌లో ఉంటున్నాడు. ఇద్దరు బీటెక్ చదువుకునే సమయంలో స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగిన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు యమహా ఆర్ 15 బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎర్రగడ్డ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వేగంగా ప్రయాణిస్తూ భరత్‌నగర్ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. కౌషిక్ బైక్ నడుపుతుండగా సందీప్ వెనుక కూర్చున్నాడు. ముందున్న లారీల్లో మొదటి లారీని ఓవర్ టేక్ చేసి, రెండో లారీని కూడా అదే వేగంతో ఓవర్‌టేక్ చేయబోతూ బైక్‌తో లారీని ఢీకొట్టారు. సంఘటనలో బైక్‌తో సహా ఇద్దరూ రోడ్డు పడిపోఆరు. వేగంతో కిందపడడంతో తలలు పగిలి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్, కౌషిక్ మృతదేహహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


