యువతి హత్యకు ప్రేమనే కారణమని పలువురు భావిస్తున్నారు. యువతిని కత్తితో పొడిచి పారిపోతున్న సమయంలో స్థానికులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు కారణమయ్యిందా.. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా దాడికి పాల్పడ్డానని పేర్కొన సదరు యువకుడు యువతి వైష్ణవికి పెళ్లి కుదరడం, మరో రెండు నెలల్లో పెళ్లి అయిపోతుందన్న సమాచారం ఉండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అయితే వైష్ణవి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు కొట్టి పారేస్తున్నారు. అయితే నిందితుడు ఆపస్మారక స్థితి నుంచి బయటపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.


