బాధ్యతలు స్వీకరించిన జడ్చర్ల పుర కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన జడ్చర్ల పుర కమిషనర్‌

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల మున్సిపల్‌ నూతన కమిషనర్‌గా గిరీష్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా ఉన్న లక్ష్మారెడ్డిని బదిలిచేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో గిరీష్‌ను నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఆయన మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే క్షేత్రస్థాయిలో పర్యటించి.. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన నాయకులను కలిసి మాట్లాడారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సంజీవయ్య కాలనీలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. పాతబస్టాండ్‌, నాగర్‌కర్నూల్‌ రోడ్లలో జరుగుతున్న మురుగు కాల్వల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారిగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదని, అంకితభావంతో పనిచేసి మార్పు తీసుకువద్దామని కోరారు. సమావేశంలో మేనేజర్‌ లక్ష్మన్న, ఏఈ గాయత్రి, ఆర్‌ఐ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక

నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్‌కు ఆదివారం భారీఎత్తున ధాన్యం వచ్చింది. దాదాపు 20 వేల బస్తాల ధాన్యం రాగా.. ఇందులో ఆర్‌ఎన్‌ఆర్‌ 17481 బస్తాలు, 1010 రకం 3 బస్తాలు వచ్చింది. కాగా.. ఆర్‌ఎన్‌ క్వింటాల్‌ రూ.2,566, కనిష్టంగా రూ.2,100 ధర లభించింది. అలాగే 1010 రకం క్వింటా గరిష్టంగా రూ.1,812, కనిష్టంగా రూ.1,769 ధర పలికిందని కార్యదర్శి రమేష్‌ తెలిపారు.

నేటినుంచి క్రీడా వారోత్సవాలు

23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement