అథ్లెటిక్స్‌ సరదా.. | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ సరదా..

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

జిల్లా కేంద్రంలో మొదలైన అథ్లెటిక్‌ శిబిరం

ఖేలో ఇండియా, జిల్లా అథ్లెటిక్స్‌

ఆధ్వర్యంలో నిర్వహణ

ఆసక్తి కనబరుస్తున్న బాలబాలికలు

జూన్‌ 7వరకు నిర్వహణ

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీస్టేడియంలో విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి వారు అథ్లెటిక్‌ క్రీడల్లో రాణించడంమే లక్ష్యంగా ఖేలో ఇండియా, జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గతనెల 27వ తేదీన అథ్లెటిక్‌ శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు కోచింగ్‌ను అందిస్తున్నారు.

50 మందికిపైగా హాజరు

స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ అథ్లెటిక్‌ క్యాంప్‌కు ప్రతిరోజు 50మందికి పైగా క్రీడాకారులు హాజరై ఖేలో ఇండియా అథ్లెటిక్‌ కోచ్‌ హారికదేవి ఆధ్వర్యంలో కోచింగ్‌ తీసుకుంటున్నారు. అండర్‌–08 నుంచి అండర్‌–14 వరకు బాలబాలికలకు అథ్లెటిక్స్‌లో ఉన్న ప్రధాన ఆటలు 100, 200, 400 మీటర్ల రన్నింగ్‌, హైం జంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌, డిస్కస్‌ త్రో తదితర వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు, సాయత్రం 5గంటల నుంచి 7గంటల వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు క్రీడాకారులకు అరటి పండ్లు, బిస్కెట్లు అందజేస్తున్నారు.

గ్రౌండ్‌లో రన్నింగ్‌ చేస్తున్న విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement